మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి, తనయుడు కౌశిక్ రెడ్డి

Published: Friday March 12, 2021

బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా శ్రీ శివగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. మహేశ్వరం నియోజకవర్గం లోనీ మహేశ్వర గ్రామంలో శ్రీ శివగంగా ఆలయంలో గురువారం నాడు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తనయుడు కౌశిక్ రెడ్డి శ్రీ శివ గంగా శివలింగ విగ్రహానికి అభిషేకం చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ తో పాటు అభిషేకం చేశారు. అదేవిధంగా తుక్కుగూడ లో గట్టుపల్లి వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి, రావిరాల గ్రామంలో ఓంకారేశ్వర ఆలయంలో పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..... యావత్ తెలంగాణ ప్రజలందరూ గత సంవత్సరం అనేక ఇబ్బందులకు గురయ్యారు, ఈ నాటి నుంచి యావత్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని సన్నిధిలో కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, సభ్యులు, చంద్రయ్య, దీప్ లాల్ చౌహాన్, తదితరులు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.