శివనామ స్మరణ తో మారుమ్రోగినా ఆలయాలు

Published: Friday March 12, 2021
​గొల్లపల్లి, మార్చి11 (ప్రజాపాలన ప్రతినిధి): గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూర్ రాపల్లి గొల్లపల్లి లక్ష్మీపురం గ్రామాల్లోని ఆలయాల్లో, ప్రతి ఇంట్లోభక్తీ శ్రద్ధలతో శినామస్మరణ ఉపవాస దీక్షలు ఆకాశదీపాలు కొటొక్కమొక్కులు కై  పత్రం పుష్పం ఫలం తోయలతో  ఆలయా దర్శనాలు. ​ఆలయాల్లో శోభాయమానంగా షామియానాలు చలువ పంద్ధిర్లు రంగు రంగుల విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించనున్న ఆలయాల్లో గురువారం తెల్లవారు జామునుంచి వేదపండితులు వేదఘోష చేస్తుంటే ఆలయా అర్చకులతో మహా శివారాత్రి ప్రత్యేక విశేష పూజలు అభిషేకాలు అర్చనలతో శివనామ స్మరణ చేస్తూ మారూమ్రోగాయి వేలాదిమంది భక్తులు పిల్ల పాపలతో దర్శనంచేసుకొని కోరినకోర్కెలుతీర్చే మహాశివుని  సేవలోసర్పంచ్ నల్ల శ్యాం ఎంపీపీ నక్కశంకర్ ప్యాక్స్ చేర్మెన్ రాజ సుమన్ రావు ఎంపీటీసీ మంజుల రవీందర్ అలయకమిటి చైర్మన్ రామారావు ఉపసర్పంచ్ సత్యం రావులు దర్శించుకున్నారు .లింగోద్భవా కాలంలో విశిష్ట పూజ శివపార్వతుల కళ్యాణం, సాంస్కృతికకార్యక్రమాల ఏర్పాట్లుచేశారు.  దాతల సహాయంతోఎడ్లబండ్ల పోటీలునిర్వహించి  బహుమతులు అందచేశారు శేకు భాషా తిరుమల పురం(పీడీ) ప్రథమ బహు మతి  పావుతులం బంగారం, పత్తిపాక వినయ్ కుమారు ద్వితీయా బహుమతి 10 తులాల వెండి, మాదాసు వెంకటేశ్ తృతీయ బహుమతి 05 తులాల వెండి, భక్తులకు అనదానము ప్రసాదాల వితరణ చల్లని శుద్ధజలం సౌకర్యాలు  తగు జాగ్రత్తలు ఏర్పాట్లు చేశారు.