వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం

Published: Monday May 09, 2022
మధిర మే 7 ప్రజాపాలన ప్రతినిధిమధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో శనివారం పలు దేవాలయాల్లో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం వేదమంత్రాల సాక్షిగా పలువురు వేద పండితులచే నిర్వహించారు. గ్రామంలో నూతనంగా మూడు దేవాలయాల్లో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయగా రెండు దేవాలయాల్లో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు ఒకేసారి ఐదు దేవాలయాల్లో స్వామి వారి విగ్రహాలు ప్రతిష్ట ధ్వజ స్తంభం ప్రతిష్ట చేయటంతో రెండు రాష్ట్రాల నుండి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు అంతేకాకుండా వివాహాలు చేసుకొని ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులు గ్రామంలో జరుగుతున్న దైవ కార్యక్రమానికి హాజరై ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి తొక్కిసలాట జరగకుండా పలుచోట్ల ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి మహా అన్నదానాన్ని నిర్వహించారు. ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు రాణి దంపతులు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శీలం వెంకట రెడ్డి విద్యలత దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు జిల్లా నాయకులు మల్లాది వాసు పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వరరావు కౌన్సిలర్లు మేడికొండ కళ్యాణి కిరణ్ తొగరు ఓంకార్ వరలక్ష్మి శీలం వీరవెంకట రెడ్డి కంభంపాటి శివ, సర్వయ్య, రేగళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు