మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసాద వితరణ

Published: Friday March 12, 2021
మధిర మార్చి 11 ప్రజా పాలన ప్రతినిధికీర్తిశేషులు కోమటిడ్డి రంగారావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి లక్ష్మీ సీతమ్మ వారి కుమారులు కోమటిరెడ్డి నరసింహారావు శ్రీనివాసరావు గార్లు మధిర శ్రీ మృత్యుంజయ స్వామి దేవస్థానం నందు స్వామి వారి ప్రసాద (పులిహోర) వితరణ మరియు డాక్టర్ వసంతమ్మ సేవాసదనం మానసిక దివ్యాంగుల ప్రత్యేక హాస్టల్ వసతి గృహము నందు అన్నదాన వితరణ ఈ సందర్భంగా కోమటిడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మా తండ్రి గారైన కోమటిడ్డి రంగారావుగారి జ్ఞాపకార్ధం పలు సేవా కార్యక్రమాలను చేపట్టాము. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మధిరలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం. దానిలో భాగంగా ఉదయం స్వామి వారి సన్నిధిలో ప్రసాద వితరణ మరియు అన్నం పరబ్రహ్మస్వరూపం కాగా డాక్టర్ వసంతమ్మగారి సేవాసదన్ లో మానసిక దివ్యాంగుల ప్రత్యేక వసతిగృహం నందు అన్నదాన కార్యక్రమం చేపడతామని తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని నాన్న గారి జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు  ఈ కార్యక్రమంలో పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ప్రజా పాలన మరియు స్నేహ టీవీ మధిర రిపోర్టర్  పాల్గొన్నారు