వైభవంగా భక్త మార్కండేయ ఆలయ వార్షికోత్సవం

Published: Thursday March 04, 2021
​గొల్లపల్లి, మార్చి03 (ప్రజాపాలన ప్రతినిధి): గొల్లపల్లి మండలం రంగదామునిపల్లె గ్రామంలోని శ్రీభక్త మార్కండేయ ఆలయ11వ వార్షికోత్సవం పురస్కరించుకుని సుందరంగా అలంకరించనున్న స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు, రుద్రపారాయణ, హోమము, ఆలయ అర్చకులు గుండీ వినయ్ శర్మ బృందంచే పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ పద్మశాలీ కులబందావులు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ప్రజలు, శివ దీక్ష పరులు, స్వామివారి దర్శనం చేసుకొని అనందం వ్యక్తం చేశారు.