మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

Published: Wednesday March 03, 2021
కరోన 2 వేవ్ లో ఉత్సవాలు సాధ్యమేనా
కవిడ్ నియమాలతో ఉత్సవాలు జరపడం అధికారులకు సాధ్యమైనదేన
మధిర, మార్చి 02, ప్రజాపాలన ప్రతినిధి: ప్రజల ఇదిప్రసిద్ధి గాంచిన ఈ ఉత్సవాలకు అధిక సంఖ్య లో పాల్గొనే భక్తులకు, ప్రజలకు ఆరోగ్య నష్టం వాటిల్లితే అది మోసే బాధ్యత అధికారులదా, నాయకులదా? ప్రతి సంవత్సరం మధిర మునిసిపాలిటీ పరిధి లో మృత్యుంజయ స్వామి ఆలయం ప్రాంగణంలో జరిగే మహా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నా విషయం తెలిసినదే. అయితే గత సంవత్సరం ఉత్సవాలు తర్వాత కరోన రావడం వల్ల ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు కరోన 2nd వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ సంవత్సరం ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నయి. మధిర అటు తెలంగాణ ఆంధ్ర కు బోర్డర్ కావడం వల్ల చుట్టూ ప్రాంతాలు నుండి ప్రజలు భారీగా ప్రతి ఏటా వస్తారు. కానీ ఈ సమయం లో ఉత్సవాలు నిర్వహించడం వల్ల  కరోన విజృంభించి ప్రజలకు నష్టం కలిగితే ఎలా అనే ప్రశ్న ఈ ప్రాంత ప్రజలలో మెదులుతూ ఉన్నది. అది కాకా ఈ ఉత్సవాలకు జాయింట్ విల్, వంటి వాటిని పక్క రాష్ట్రలా నుండి వస్తూ ఉంటారు.అక్కడి పరిసత్థులు చూస్తూనే ఉన్నాం అలాగే ఈ ఉత్సవాలలో  చిన్న చిన్నతినుబండారాలు  వ్యాపారాలు అధిక స్థాయి లో జరుగుతూ ఉంటాయి ఆయా వ్యాపార సముదాయాలు వద్ద ప్రజలు కోవిడ్ నియమాలు పాటిస్తారా లేదా అలా పాటించేలా అధికారులు చర్యలు చేపట్టగలరా అనేది ప్రశ్నార్ధకం. ఇప్పటికే రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ వంటి  కొన్ని అలయాలు లో కరోన విజృంభన వల్ల ఆలయాలు మూతవేసిన సందర్భంలో ఉత్సవాలు నిర్వహించడం ఎటువంటి పరిస్థితులు దారి తెస్తుందో చెప్పలేని పరిస్తితి అలాగే ఇటివలే ఆలయ కొత్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కొందరు నాయకులు కు పాజిటివ్  వచ్చిన విషయం తెలిసినదే అలాగే కొందరు ఉపాధ్యాయులు కు విద్యార్థులకు ఇటివిల కాలం లో పోసిటివ్ వచ్చిన విషయం వార్తలలో చూశాం. ఒక వేళ ఉత్సవాలు జరిగి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వాటిల్లితే అది మోయాల్సిన బాధ్యత అధికారులదా లేక ఉత్సవ నిర్వహించిన నాయకులుదా అనేది శోచనీయం ఏది ఏమైనా నష్టం జరిగాక తీసుకునే జాగ్రత్తలు కంటే ముందుగానేఉత్సవాల విషయం లో సమాలోచన చేయవలసిన అవసరం ఉందని  అటు ప్రజలు నాయకులు కోరుకుంటున్నారు.