మధిర శివాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Published: Tuesday March 02, 2021
మధిర, మార్చి1, ప్రజాపాలన ప్రతినిధి: మధిర శివాలయం దగ్గర ఆలయ కమిటీ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల ఆ మహాశివుని కృపాకటాక్షం పొందుతారని సిబ్బందిని ఈవో సత్యనారాయణ మరియు మృత్యుంజయ స్వామి చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు  కమిటీ సభ్యులు ఈ సందర్భంగా అభినందించారు అనంతరం శివాలయం ఉత్సవం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు అరిగే శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు కోటార్ రాఘవరావు, తెరాస నాయకులు పాలపోతు ప్రసాద్, బత్తుల శ్రీనివాసరావు, విగ్నేశ్వర ఆలయ ధర్మకర్తలు క్రిష్ణ నాయక్, రామకృష్ణ, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు