అంగరంగా వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం...

Published: Thursday February 25, 2021
బీరుపూర్, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుని దేవుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక నాయకులు అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు కళ్యాణ మహోత్సవంలో పాల్గోని నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మారమేష్ గ్రామ సర్పంచ్ ఘర్షకుర్తి శిల్పరమేష్ ఆలయ అధికారి ముద్దం శ్రీనివాస్ ముప్పాల రాంచందర్ రావు కోలుముల రమణ గోనె రమణ రావు సుమన్ కేషవులు బైరవేని ఆంజనేయులు దేవస్థాన అర్చకులు సంతోష్ చార్యులు మధు సంతోష్ లాయర్ రామచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.