శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.

Published: Saturday November 20, 2021
మధిర నవంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలంలో ట్టు మడిపల్లి మాటూరు మర్లపాడు దెందుకూరు గ్రామాల్లో లో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామునే శివాలయాల్లో పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు మధిర శ్రీ మృత్యుంజయ శివాలయంలో కార్తీక పౌర్ణిమ కావడంతో భక్తులతో శివాలయలు కిటకిటలాడుతున్నాయి, తెల్లవారు జాము నుంచే భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, వైరా నదిలో దీపాలను వదిలి తమ మొక్కులు చెల్లిచుకుంటున్నారు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కార్తీక స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. మధిర లో మృత్యుంజయ ఆలయం వద్ద వైరానది లో దీపాలు వెలిగించి, నది ఒడ్డున దీపారాధన చేశారు. అనంతరం అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణిమ ఉపవాస దీక్షలు చేసి, నది స్నానాలు ఆచరించి, దీపారాధన చేస్తే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారిిిి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మండలం మండలం శివాలయంలో అర్చకులు గ్రామ ప్రజలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు