మత్స్యగిరి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం

Published: Wednesday November 17, 2021
యాదాద్రి నవంబర్ 16 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా మంగళవారం రోజున కార్యక్రమలు యాగశాల ద్వారతోరణార్చన, ధ్వజారోహణం, చతుస్థానార్చన, హోమం, ఉత్సవమూర్తులకు స్నపనము, అలంకారము, బలిప్రధానం, శాత్తుమొర,  తీర్థప్రసాద గోష్టి పూజా కార్యక్రమాలు వేదపండితులు నిర్వహించారు. బుధవారం స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ఈఓ కె రవికుమార్, అర్చకులు ధర్మ కర్తలు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.