రావినూతల గ్రామం లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Published: Monday October 11, 2021
బోనకల్లు, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని రావినూతల గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ మహిళ సాంప్రదాయక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను గ్రామంలో మహిళలు బతుకమ్మలు ఆడదు సంబరాలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆడుతున్నటువంటి మహిళా సోదరి సోదరీమణులు ఉమామహేశ్వర దేవాలయం వద్ద ఆలయ కమిటీ తరపున బతుకమ్మ సంబరాలను నిర్వహించు కొని అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలను నిర్ణయించుకోవడం జరిగింది.