వెలుగు గుట్టలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Published: Friday October 08, 2021
మేడిపల్లి, అక్టోబరు 07 (ప్రజాపాలన ప్రతినిధి) ఉప్పల్ వెలుగు గుట్ట శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాపరమేశ్వరి అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా మరియు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఉదయం 5.00 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనము అంకురార్పణ, కంకణ ధారణ, అమ్మవారికి పంచామృత అభిషేకము, శ్రీసూక్తం మరియు దుర్గాసూక్త విధానంతో మహాభిషేకము, బాలాత్రిపుర సుందరి అలంకారము సుహాసినిలచే కుంకుమార్చన తీర్థ ప్రసాద వితరణ జరిగింది. తదనంతరం 9.30 నిముషాలకు చండీహోమం ప్రారంభమైనది. 12 గంటలకు పూర్ణాహుతి మహా మంగళ హారతి తీర్థప్రసాద వితరణ అత్యంత కన్నుల పండుగగా జరిగినది. అలాగే అన్న ప్రసాద వితరణ జరిగింది సాయంత్రం 6 గంటలకు శ్రీచక్రానికి పుష్పార్చన రాత్రి ఏడు గంటల 45 నిమిషాలకు ఊంజల్ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.