తులేకలాన్ లో ఘనంగా దుర్గామాత ప్రతిష్ట మహోత్సవం

Published: Friday October 08, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : దుర్గాష్టమి నవరాత్రులను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి విగ్రహ మంగళపల్లి పిఏ సీఎస్ వైస్ చైర్మన్ సామ రవీందర్ రెడ్డి అశ్విని దంపతుల సహకారంతో గ్రామ సర్పంచ్ యాదగిరి రజిత దంపతుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో దుర్గా మాతకు నలం చక్రవర్తుల వెంకటయ్య ఆచార్యులు, సుదర్శన్ ఆచార్యుల వేదమంత్రాలతో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహప్రతిష్ట చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతామని అందులో భాగంగా జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులను ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రూపాలుగా అలంకరించి ఆరాధించడం జరుగుతుందని అన్నారు. నైవేద్యాలను కూడా రోజుకో వంటకం చేసి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మంగళపల్లి పిఎసిఎస్ చైర్మన్ సామ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ నాగటి నాగమణి, రాజిరెడ్డి, భత్తుల విజయ, రంగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు గుజ్జ యాదగిరి, వార్డ్ మెంబర్ సామ జంగారెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.