సిర్లీ హిల్స్ కాలనీలో గణపతి హోమం

Published: Monday September 13, 2021
బాలాపూర్, సెప్టెంబర్12, ప్రజాపాలన ప్రతినిధి : పరమ శివపార్వతుల తనయుడు విగ్నేశ్వర దగ్గర శ్రీ మాతా ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిర్లా హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 గణేష్ మండపం వద్ద గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి 27వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి లక్ష్మి దంపతులతో పాటు పలువురు దంపతులు హోమంలో పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హోమంలో పాల్గొన్న దంపతు లందురు శ్రీమాతా ఉమెన్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమిత్ర శ్రీనివాస్ గౌడ్, అరుణ లక్ష్మణ్ చారి, సుశీల రామచంద్రయ్య, శ్రీలత సంపత్, పద్మ పెంటయ్య, పల్లవి దేవానంద్, కాలనీవాసులు సంగీత, మంజుల, శ్యామల, స్వప్న, వెంకటేష్, శివకుమార్ చారి, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పెద్దలు పాల్గొన్నారు.