బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం

Published: Tuesday September 07, 2021

వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన :  శ్రావణ మాసం చివరి సోమవారం దృష్ట్యా బుగ్గరామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు సూర్యపేట ఆత్మలింగం, సూర్యపేట మల్లకార్జున్ ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు, కళ్యాణ ఉత్సవాన్ని, రుద్రభిషేకం నిర్వహించారు. మహిళా భక్తులు, భక్తాగ్రేసరులు బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని చూసి తరించారు. ఆలయ అర్చకులు శ్రీకాంత్ స్వామి వేద మంత్రోచ్ఛారణలతో ఆరయ ప్రాంగణమంతా ప్రతిధ్వనించింది. సూర్యపేట ఆత్మలింగం పుణ్య దంపతులు రుద్రాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు నారాయణ సేవ (అన్నదానం) కార్యక్రమం కొనసాగించారు