చొప్పకట్లపాలెం లో ఘనంగా ముత్యాలమ్మ బోనాల జాతర

Published: Monday September 06, 2021
బోనకల్, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : మధిర డబ్బులు కరెక్ట్ కాదుమండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం బొడ్రాయి ప్రతిష్ట, శివాలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. నేడు 16 రోజుల పండుగ లో భాగంగా ముత్యాలమ్మకు భక్తులు వందలాదిగా బోనాల సమర్పణ చేశారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమంలో ఊరంతా ఏకమై ముత్యాలమ్మ బోనాల జాతరను ఘనంగా జరుపుకుంటూ బొడ్రాయి కి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఊరంతా మేళతాళాలతో మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి ముత్యాలమ్మ బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రం శెట్టి సుబ్బారావు, శివాలయ చైర్మన్ వడ్డే వీరప్రసాద్, బోయిన శేఖర్ బాబు, కొండేటి గోపి, కిలారి సురేష్, వడ్డే నరేష్, బోయినపల్లి ముఖేష్, తుపాకుల నరేష్, కొనకంచి నాగరాజు యూత్ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.