ఘనంగా ముత్యాలమ్మ సంబరాలు

Published: Monday September 06, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : ఘనంగా ముత్యాలమ్మ సంబరాలు వేడుకలుమండల ఎర్రుపాలెం మండలం కేంద్రంలోని రాజుల దేవరపాడు గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో భాగంగా గ్రామ రాశి తో గ్రామం మొత్తం ఊరేగింపుగా తిరిగి ముత్యాలమ్మ అమ్మవారి కి బొడ్డు రాయి వద్ద జాతర గా బోనాలు చెల్లించి పెద్ద ఎత్తున ముత్యాలమ్మ అమ్మవారి జాతరను గ్రామ ప్రజలు ఘనంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండారు నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడుతూప్రతి సంవత్సరం లాగానే శ్రావణ మాసంలో ముత్యాలమ్మ సంబరాలు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న అని ఆ అమ్మ వారి దీవెనలతో రైతులు అందరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు, గ్రామ దేవస్థాన కమిటీ చైర్మన్ చిన్న నాగిరెడ్డి, వెన్న పూస వెంకట్ నారాయణ రెడ్డి, లక్కీరెడ్డి విశ్వ నాధ రెడ్డి, గ్రామ పెద్దలు, పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు