కొవ్వూరు ప్రాముఖ్యత

Published: Wednesday May J, 2016

కొవ్వూరు న్యూస్‌: గోదావరి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది గౌతమమహర్షి పేరు. గలగలా పారే గోదావరి సవ్వడిపై సినీగేయ రచయితలు ఎన్నో పాటలు వ్రాసారు. గోదావరి అందాలను కవులు ఎంతగానో వర్ణించారు. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతతో అలరాడుతుంది. అటు వంటి గోదావరి నదిలో అందునా గౌతముడు తప్పస్సు చేసిన కొవ్వూరులోని గోష్సాదక్షేత్రంలో స్నానమాచరిండం అంటే దక్షిణాది తీర్ధయాత్రలలో ఒక బాగంగా మారిపోంది. గోదావరి పుట్టుకకు కారణంగా పేర్కొనే గోష్పాదక్షేత్రం విశిష్ఠత అందరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. దండకారణ్యం ప్రాంతంలోని మైదాన ప్రాంతంలో గౌతమ మహర్షి తప్పస్సు చేసుకుని జీవించేవారు. అప్పుడు విపరీతమైన క్షామం వచ్చి ఈ ప్రాంతవాసులకు ఆహారం కొరత వచ్చింది. దీనిని రూపుమాపడానికి మహర్షి తన తప:శక్తిని ఉపయోగించి సాయంత్రం వడ్లుజల్లితే తెల్లవారేటప్పటికి పంట చేతికి వచ్చేది. దీనితో ఈ ప్రాంత వాసులకు ఆహారం అందించేవారు. ఇది చూసిన దేవతలు మానవులకు ఈ విదింగా ఆహారం అందితే సోమరులుగా మారతారని దీనికి పరిష్కారం ఏమిటని ఆలోసించి గణాదిపతి అయిన వినాయకుని సంప్రదించారు. మహర్షి తప:శక్తి వృదాగా పోకూడదని ఇది ఏ కొద్ది మందికో కాకుండా సర్వజగతికి ఉపయోగపడాలని బావించిన వినాయకుడు గోవుగా మారి గౌతముని పంటను పాడుచేయసాగింది. ఇది చూసిన గౌతముడు దర్బపుల్లతో గోవును కొట్టగా గోవు మృతిచెందింది. గోహత్యాపాపమును పోగొట్టడానికి ఏమిచేయాలని తొటి మహర్షుల సలహామేరకు కఠోర తపస్సు గావించి శివుని జఠాలంలోని గంగను గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా ప్రవహింపజేసారని పురాణాలు చెపుతున్నాయి. ఈ విధంగా గోహత్యజరిగిన ప్రాంతం పేరు గోవూరు. ఇది కాలక్రమేణా  నేడు కొవ్వూరుగా పిలవబుడుతుంది. ఈ క్షేత్రం మహత్యం గురించి తెలిసిన ఎంతోమంది ఈ ప్రాంతంను ఒక్కసారి అయినా సందర్శించాలని కోరుకుంటారు. ఈ క్షేత్రం  స్పటికలింగం, బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వరస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, షిర్డి సాయి ఆలయం, శ్రీలక్ష్మీ నరశింహస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, గోశాల, వినాయకుని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, గీతామందిరం, గౌడియమఠం, కనకదుర్గ ఆలయం, బ్రహ్మంగారి ఆలయం, గౌతమమహర్షి ఆలయం ఇలా ఆనేక ఆలయాలు నిర్మించారు. ఈ ప్రాంతాన్ని బారతదేశంలోని ప్రతీ పౌరుడు ఒక్కసారి అయినా సందర్శించుకొని పునీతులు కావాలని కోరుకుంటారు.