మత్స్యగిరి ఆలయంలో స్వామి కళ్యాణ మహోత్సవం

Published: Friday February 05, 2021

వలిగొండ ప్రజాపాలన మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి కళ్యాణం స్వాతి నక్షత్రం సందర్భముగా గురువారం ఘనంగా  నిర్వహించారు.అనంతరం నిజామాబాద్ జిల్లాకు చెందిన మురళి విజయలక్ష్మి సౌజన్యంతో భక్తులకు అన్నదానం కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి,ఆలయ సిబ్బంది,వేద పండితులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.