ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి

Published: Thursday January 21, 2021

* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో  ఆసరా
* రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికల నిర్మాణం
* రైతుబంధు కింద 7500 కోట్లు పంపిణీ
* నవాబ్‌పేట్‌ మండలంలో పర్యటించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 20 ( ప్రజాపాలన ) : అన్నం పెట్టే రైతన్నకు కన్నీరు రాకుండా చూస్తున్న ఘనత సిఎం  కేసీఆర్ కు దక్కుతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం చేవెళ్ళ నియోజకవర్గము నవాబుపేట్ మండల కేంద్రంలో రైతు వేదికను, పాఠశాల అదనపు గదులు, లైబ్రేరీ భవనాన్ని, ఎల్లకొండ, గ్రామాల్లో రైతు వేదికలను, ప్రారంభించారు. చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ  సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యలతో కలిసి ప్రారంభోత్సవాలలో పాల్గొన్న మంత్రి సబితా రెడ్డి. చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయలతో  ఆసరాగా నిలుస్తున్నారని కొనియాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చర్చించుకోవడానికి, సలహాలు, సూచనలు పొందటానికి 2604 రైతు వేదికలు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. నేరుగా ఎకరాకు 5 వేల పెట్టుబడి సహాయం, సంవత్సరానికి 10 వేలు రైతు బంధు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని గుర్తు చేశారు. రైతు బంధు కింద 7500 కోట్ల పంపిణీ చేశామని వివరించారు. రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మాణాలు పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు కోసం కృషి చేస్తున్నామన్నారు.
19 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎల్లకొండ శివాలయంలో పూజలు నిర్వహించారు.