మధిరలో శ్రీరామ జన్మభూమి తీర్దక్షేత్ర ట్రస్ట్ నిధి సేకరణ ప్రారంభం

Published: Thursday January 21, 2021
ఈరోజు  అనగా 20-01-2021 ఉదయం 8.30 గంటలకు  మధిర శ్రీ వినాయక గుడి వద్ద అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణానికి నిధి సేకరణకు  అంకురార్పణ జరిగింది. ఈ నిధి సేకరణకు సంబంధించిన కరపత్రాలను ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీ  మురళీకృష్ణ గారు విడుదల చేసి, రామమందిర నిర్మాణం నిధి సేకరణ మధిర నియోజకవర్గ స్థాయి నిధి సేకరణ సంయోజక్ అయిన శ్రీ భట్ల పెనుమర్తి రాజేశ్వర శర్మ గారికి అందజేయడం జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో రాజేశ్వర శర్మ గారు మాట్లాడుతూ ప్రతి హిందువు బంధువు భవ్యమైన రామమందిర నిర్మాణం తనవంతుగా భాగస్వామ్యం అవ్వాలని, నిధి సేకరణకు వచ్చే శ్రీరామ సేవకులకు సహకరించాలని కోరారు.
 
ఈ కార్యక్రమంలో మధిర ఇంచార్జ్ జయపాల్ రెడ్డి గారు, నిధి ప్రముఖ్ శ్రీ మాదిరాజు వంశీ గారు, శ్రీ శివరాజు శ్రీనివాసరావు గారు, శ్రీ రామి శెట్టి నాగేశ్వరరావు గారు, శ్రీ చిలువేరు సాంబశివరావు  గారు, శ్రీ యాగేశ్వరావు గారు, శ్రీ  సోమేశ్వరరావు గారు, శ్రీ కుంచెం కృష్ణ రావు గారు, శ్రీ  తిరుపతి స్వామి గారు, కట్ట కోటేశ్వరరావు గారు, శ్రీ శివరాజు సుమంత్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.