కె సి ఆర్ ఇచ్చిన మాట మరిచిపోయిండు కాసాని

Published: Tuesday January 12, 2021
సుజాతనగర్ సి పి ఎమ్ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం మరియు ఆసరా పింక్షన్ల కోసం
అర్హులైన పేదలందరికీ స్థలం ఉన్నచోట డబల్ బెడ్ రూమ్ కట్టించి ఇవ్వాలని
57 సంవత్సరాలు దాటిన వారికి ఆసరా పింఛన్ 3000 రూపాయలు ఇవ్వాలని
 సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో
 ఈరోజు సిపిఎం పార్టీ ఆఫీస్ నుండి సెంటర్ మీదుగా భారీ ర్యాలీగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళినారు ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు స్థలం ఉన్నచోటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ ఇస్తామని చెప్పి ఈ రోజున సుజాతనగర్ మండలం లో వెయ్యి కుటుంబాల వారు ఇల్లు లేక కిరాయి ఇళ్ళలో ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా పెరిగిన ధరలతో బతుకు బండి లాగలేక జీవనం కష్టతరమైన ఇంటికి రాయల్ కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ తరుణంలో అర్హులైన పేదలందరికీ ఫలానా చోట డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని తల లేని వారికి ప్రభుత్వమే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని అదేవిధంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ 3000 రూపాయలు ఇవ్వాలని వికలాంగులకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకపోతే పైన పేర్కొన్న హామీలు ప్రభుత్వం అమలు చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సమీకరించి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని పేదలకు డబుల్ బెడ్ రూమ్ సాధించేవరకు సాధించేవరకు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుగులోత్త్ ధర్మ గారు మండల కార్యదర్శి వీర్ల రమేష్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కాట్రాల తిరుపతిరావు గండమాల భాస్కర్ బచ్చల కూర శ్రీను కొండే కృష్ణ వీర్ల సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.