పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి - ఎంపీటీసీలు, సర్పంచులు.

Published: Tuesday January 12, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల జనవరి 11,ప్రజాపాలన: మండలంలో గత 30 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న పోడు భూముల పై అటవీశాఖ అధికారులు దాడులు చేస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నారని, పోడు భూములపై అటవీశాఖ దాడులను నిలిపివేసి రైతులకు పట్టాలు ఇవ్వాలని మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీఓ వెంకట్రావులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేరెడ్డి వసంతపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, ఇప్పటికైనా పోడు రైతులపై అటవీశాఖ దాడులను నిలిపివేసి పోడు భూములకు పట్టాలు  వచ్చేవిధంగా మండల పరిషత్ తరుపున తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, సాయనపల్లి ఎంపీటీసీ  కల్తి క్రిష్ణారావు, రోళ్ళగడ్డ ఎంపీటీసీ కల్తి రాజేశ్వరి, శంభునిగూడెం ఎంపీటీసీ పర్శిక పద్మ, గుండాల సర్పంచు కోరం సీతరాములు, మామకన్ను సర్పంచు కొడెం ముత్యమాచారి, రోళ్ళగడ్డ సర్పంచు అజ్మీరా మోహన్, శెట్టుపల్లి సర్పంచు కల్తి ప్రమీల రాజు, శంభునిగూడెం సర్పంచు ఈసం సుధాకర్, కాచనపల్లి సర్పంచు పూనెం సౌజన్య బాబు, ముత్తాపురం సర్పంచు పూనెం సమ్మయ్య, పడుగోనిగూడెం సర్పంచు కొటెం జయసుధ శోభన్ బాబు, సాయనపల్లి సర్పంచు బచ్చల లక్ష్మినర్సు, దామరతోగు సర్పంచు సుతారి సరోజన సత్యం, లింగగూడెం సర్పంచు జనగం నర్సింహారావు పాల్గొన్నారు. 

   ఫొటో రైటఫ్:-ఎంపీపీకి వినతిపత్రం అందజేస్తున్న ఎంపీటీసీలు, సర్పంచులు.