తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఆవిష్కరణ
Published: Tuesday January 12, 2021

తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఆవిష్కరణ
పాలేరు నేలకొండపల్లి జనవరి 11 ప్రజాపాలన
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల. పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో.
తెలంగాణ ఇంటి పార్టీ జిల్లా అధ్యక్షులు బత్తుల సోమయ్య. ఆధ్వర్యంలో డాక్టర్ చెరుకు సుధాకర్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార వాల్ పోస్టర్లను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటి పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమయ్య మాట్లాడుతూ... శాసనమండలి లాంటి పెద్దల సభకు ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని ఎన్నుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 60 సంవత్సరాల నుండి ఉద్యమకారులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు జరిగినా కేంద్ర ప్రభుత్వాలఅణచివేతలు, ప్యాకేజీలతో సరిపెట్టారే తప్ప రాష్ట్రాన్ని ఏర్పాటుచేయలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒళ్ళు కాల్చుకుని పిట్టల్లా రాలిపోతున్న తెలంగాణ బిడ్డల శవాలనుచూసి చలించిపోయిన సోనియమ్మ మానవత్వంతో, కరుణాకటాక్షంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని బత్తుల సోమయ్య అన్నారు. అలాంటి తెలంగాణను కెసిఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ల చేతుల్లో తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఉద్యమకారులు, అమరుల త్యాగాలను గుర్తించకుండా, వారి కుటుంబాలను ఆదుకోకుండా తెలంగాణ ద్రోహులను అందలం ఎక్కించడం దారుణం అన్నారు. అలాగే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యం వహించడం విచారకరమన్నారు. మన ఆకాంక్షలు, హక్కుల సాధనకు మండలిలో ప్రశ్నించే గొంతుకగా అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ నిలబడ్డారని, ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచి, మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించాలని కోరారు. ఈ మేరకు స్థానిక తహశీల్దారు, మండల పరిషత్, వెలుగు, అగ్రికల్చర్ మరియు ట్రెజరీ కార్యాలయాల్లో తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి తమ విలువైన ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాదాసు శ్రీనివాస్, మోదుగు సూర్య కిరణ్, తోట వెంకట్నారాయణ,వర్తియా రాజేష్ నాయక్, SK నాగుల మీరా, MD ఖాన్,బైరామ్ వర లక్ష్మి, ఒడ్డేబోనా వెంకటేశ్వర్లు, బానోత్ నాగేంద్ర నాయక్,గుగులోత్ నాగేశ్వరావు, భూక్యా విజయ్ బాబు తదితరులు...పాల్గొన్నారు.....

Share this on your social network: