మోడల్ స్కూల్ 7, 8వ తరగతి ప్రవేశ పరీక్ష

Published: Thursday October 29, 2020
మండల విద్యాధికారి భత్తూల భూమయ్య.
 
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన) :  వెల్గటూర్ మండలం కుమ్మరి పల్లి గ్రామంలోని మోడల్ స్కూల్  7తరగతిలో 13 హాజరైనారు ఆన్లైన్లో 36 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఎం.ఈ.ఓ తెలిపారు. 8 తరగతులకు పదిమంది హాజరైనారు. ఆన్లైన్లో 30 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు అని అయిన పేర్కొన్నారు. మొత్తం 66 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 23 మంది విద్యార్థులు మాత్రమే మే పరీక్షకు హాజరయ్యారు అని మండల విద్యాధికారి బత్తుల భూమయ్య ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎగ్జామ్ సూపరిండెంట్ గా కట్ల శ్రీనివాస్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా కె. రామయ్య విధులు నిర్వర్తించారు. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి  అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నామని అదేవిధంగా శానిటైజర్ చేశామని అని ఆయన  తెలిపారు.