కేసీఆర్ సర్కార్ పై భట్టి ఫైర్

Published: Monday July 31, 2023

తెలంగాణ  రాష్ట్రంలో  భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం  పట్టించుకోలేదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.మవారంనాడు హైద్రాబాద్ లో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవసరాలకు చెక్ డ్యాంలు కట్టడం వల్లే ఈ సమస్య నెలకొందని ఆయన  ఆరోపించారు. భారీ వర్షాల సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం వల్ల  ప్రజలు తీవ్రంగా నష్టపోయారని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు.