దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టిడిపి బృందం

Published: Thursday October 29, 2020
మధిర అయ్యప్ప నగర్ నందలి పుమ్పహౌస్ రోడ్డుకు ఇరుప్రక్కలగల 2.5 ఎకరాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తిపైరును  5దు ఎకరాలలో దెబ్బతిన్న మిర్చి పైరును పరిశీలనకు వచ్చిన తెలుగుదేశం బృందానికి చూపిస్తున్న రైతులు మయినీడి సుబ్బారావు మెడిశెట్టి కొండలరావు గార్లు 
 
పత్తి వరి మిర్చి పైరులు భారీ వర్షాలవలన ఎనిమిది వేల కోట్లరూ పాయలు విలువైన పంట నష్టం జరిగినది అని కేంద్ర పరిశీలనా బృందానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం  దెబ్బతిని15 రోజులు అయినప్పటికి భాదిత రైతులకు ఇంతవరకు పెట్టుబడి నష్టాన్నిగాని పైరు నష్టాన్నిగాని పరిహారంగా అందించి ఆదుకోలేదు వారిని ప్రభుత్వం గాలికి వదిలి వేసింది  
రాష్ట్రంలోని18 లక్షల ఎకరాలలో పైరు నష్టపోయి రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి  సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా లేకుండా వ్యవరిస్తున్నారు ప్రక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్ననే రైతువారీగా పెట్టుబడి పరిహారంక్రింద 130 కోట్లు విడుదల చేసిన విషయం ఈ టీఆర్ యస్ మొండి ప్రభుత్వం గమనించాలి  
ఎన్నికలను దృష్టినందుంచుకొని హైదరాబాద్ వాసులకు మాత్రమే సహాయ సహకారాలు అందించుటకు ఈ ప్రభుత్వం పరిమితమైన ది రాష్ట్రంలోని10 ది జిల్లాలలోని రైతులు నష్టపోయారు వీరిని మాత్రం గాలికి వదిలివేసి రైతులయెడల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు 
 ఈ విషయాలన్నీ దృష్టినందుంచుకొని  ఎకరాకు 30వేల రూపాయల చొప్పున రైతుకు నష్టపరిహారం అందించి రైతులను వెంటనే ఆదుకోవాలని  తెలుగుదేశం పార్టీ డిమాండు చేస్తున్నట్లు గా టీడీపీ రాష్ట్ర ఉపాదక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం చెప్పారు 
ఈ రొజు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన తెలుగుదేశం బృందంలో 
మధిర టౌన్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు సెక్రటరీ వీరమాచినేని శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మెయినీడి జగన్మోహన్రావు ఖమ్మం టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి మేడేపల్లి రాణి మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు మాజీ కౌన్సిలర్ గూడెల్లి నాగేశ్వరరావు వేల్పులకొండ పగిడిపల్లి కాశిరావు రావూరి రంగయ్య ఎల్మ్ల్ శ్రీను అనుమోలు సతీష్ సామినేని శ్రీమంత్ తదితరులున్నారు