కేటిఆర్ ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గ్రంథాలయ సంస్థ చైర్మన్

Published: Thursday October 29, 2020

వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) :  తెరాస పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటిఆర్ ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సనగారి కొండల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ప్రజాపాలనతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, ఇతర రాజకీయ అంశాల గురించి వివరించినట్లు చెప్పారు. కార్యకర్తలు అందరు సమన్వయంతో, సమిష్టిగా పార్టీ ప్రతిష్ఠకు తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎన్నికకు ప్రణాళికాబద్ధంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్నామని అన్నారు. ఒక్కొక్క పట్టభద్రుని ఇంటికి వెళ్ళి చైతన్యం కలిగిస్తున్నామని పూసగుచ్చినట్లు వివరించామని తెలిపారు. నాతో పాటు తెరాస టిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి శుభప్రధ్ పటేల్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ లు ఉన్నారని వివరించారు.