గ్రామాల అభివృద్దే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

Published: Thursday October 29, 2020

జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

 

గ్రామాలు అభివృద్దే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని  ఖమ్మం పాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను, గుర్తించి,అవి పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో   ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, అంతర్గత సిసి రహదారులు, నిర్మించటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు లాంటి అనేక పథకాలు ఇతర రాష్ట్రాల్లో సైతం అమలు చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి జిల్లా ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ మెండెం లలిత, వైస్ ఎంపీపీ సామినేని సురేష్, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ  పాల్గొన్నారు.