ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Published: Wednesday April 28, 2021
వికారాబాద్, ఏప్రిల్ 27, ప్రజాపాలన బ్యూరో : ప్రజలందరూ కరోనా బారిన పడకుండా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించామని వికారాబాద్, తాండూర్ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ పైలెట్ రోహిత్ రెడ్డి లు సంయుక్తంగా తెలిపారు. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భాన్ని పురస్కకరించుకొని మున్సిపల్ పరిధిలోని 15వ వార్డుకు సంబంధించిన మారుతి నగర్ లోని హనుమాన్ దేవాలయంలో వార్డ్ కౌన్సిలర్ చిట్యాల అనంత రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మురళి కృష్ణ గౌడ్ లతో కలిసి ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇంట్లోనే క్షేమంగా ఉంటూ హనుమంతున్ని భక్తి శ్రద్ధలతో పూజించాలన్నారు. ప్రజలందరూ కరోనా బారిన పడకుండా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో, ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావొద్దన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.