ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

Published: Thursday April 22, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 21, (ప్రజాపాలన ప్రతినిధి) : చిల్కానగర్ డివిజన్ బీరప్పగడ్డలోని శ్రీ సీత రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, రఘుపతి రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తదనంతరం దేవాలయంలో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీత రామచంద్ర స్వామి దీవెనలు అందరి పై ఉండాలని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి పంతులు కానయ్య, రాహుల్ మరియు కమిటీ సభ్యులు నేర్ధం భాస్కర్ గౌడ్, మేకల శివా రెడ్డి,పండ్ల కిషన్ గౌడ్, మంకల్ నరసింహ ముదిరాజ్, ఆగం రెడ్డి, జగదీష్ ముదిరాజ్, భీమ్ రాజ్, కోళ్ల రవి కుమార్ గౌడ్, అక్కటి మధు సుధన్, మల్లేష్ యాదవ్, బంటీ, చింటూ తదితరులు పాల్గొన్నారు.