నిరాడంబరంగా రాములోరి కళ్యాణ వేడుకలు

Published: Thursday April 22, 2021
పరిగి, 21 ఏప్రిల్ ప్రజాపాలన ప్రతినిధి : నిరాడంబరంగా రాములోరి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కళ్యాణానికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు. పరిగి పట్టణ బహార్ పెట్ హనుమాన్ మందిర్ లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ పూజ లో స్థానిక శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో శ్రీ సీతారాముల దీవెనలు ఉండాలని కొనియాడారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో  ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.