కాలనీవాసులు సుఖసంతోషాలతో ఉండాలి : కార్పొరేటర్

Published: Thursday April 22, 2021

బాలపూర్, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ లోని, డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కరోనా దరిదాపుల్లోకి రావొద్దని ప్రత్యేక పూజలతో బోద్ర మో ని రోహిణి రమేష్ ముదిరాజ్ ఆ దేవదేవుని వేడుకున్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కుర్ముల గూడ లో 10వ డివిజన్ కార్పొరేటర్ బొద్ర మోనీ రోహిణి రమేష్ ముదిరాజ్ ఫ్లవ నామ సంవత్సర పురస్కరించుకొని శ్రీరామ నవమి పర్వ దినమున శ్రీసీతారాముల  కళ్యాణ మహోత్సవం వేడుకలు గుడిలో జరుపుకునే వాళ్ళం కానీ ఈ సంవత్సర కరోనా మహమ్మారి వైరస్ పరిస్థితుల్లో ఎవరి ఇంట్లో వారి శ్రీసీతరాముల కళ్యాణ మహోత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం వల్ల ఆ దేవదేవుని ఉత్సవాలు తన నివాసంలో నీయమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో, ప్రత్యేక పూజతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజలందరూ, కార్పొరేషన్ ప్రజలు, ముఖ్యంగా డివిజన్ ప్రజలందరూ కరోనా మహమ్మారి వైరస్ దరిదాపు రాకుండా ఉండాలని ఆ దేవుని వేడుకొన్నారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళల కలకాలం జీవించాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలనీవాసులకు మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, కీసర మేఘన భాస్కర్ రెడ్డి దంపతులు, స్థానిక కార్పొరేటర్ రోహిణి రమేష్ దంపతులు, మాజీ సర్పంచి టేకుల చిన్న మల్లారెడ్డి, ఎడ్ల శ్రీశైలం, మత్స్యకారుల సంఘం చైర్మన్ గణేష్ ముదిరాజ్, బొద్ర మధు, ఎడ్ల శ్రీనివాస్, ఎడ్ల మల్లికార్జున్, పెద్ద అంజయ్య, బొద్ర శంకరయ్య, కే. అశోక్ గౌడ్, మత్స్యకారుల కమిటీ సభ్యులు  కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.