స్వీయ నిర్బంధమే శ్రీరామరక్షగా శ్రీ రామనవమి

Published: Thursday April 22, 2021
మల్లాపూర్, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి  విపరీతంగా పెరుగుతున్న సమయంలో శ్రీరామ నవమి ఉత్సవాలను మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రద్దు చేశారు. వాల్గొండ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే కళ్యాణ మహోత్సవం ఈ సారి కరోనా ప్రభావంతో భక్తులు లేకుండానే పూజారుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అన్న విధంగా ప్రజలు వారి వారి ఇంట్లోనే శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నారు