వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

Published: Thursday April 22, 2021

మధిర, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రామాలయం శ్రీరామనవమిని పురస్కరించుకుని మధిర లో ఉన్న అన్ని రామాలయాలలో అత్యంత వైభవంగా రాములోరి కళ్యాణం జరిపినారు మధిర రామాలయంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రామాలయ అధ్యక్షులు దొడ్డ మురళి మరియు వారి కమిటీ ఆధ్వర్యంలో మరియు జిలుగు మాడు రామాలయంలో కోమటి డి రంగారావు కుమారులు కోమటిడి శ్రీనివాసరావు దంపతులు ఆధ్వర్యంలో అలాగే స్టేషన్ దగ్గర రామాలయంలో ఘనంగా జరిపించిన శ్రీ సీతారాముల కల్యాణం అదేవిధంగా మండలంలో అన్ని గ్రామాలలో దెందుకూరు ఇల్లందులో పాడు దేశినేని పాలెం మాటూరు, మర్లపాడు, నాగవరప్పాడు, ఆత్కూరు, అల్లినగరం, మడుపల్లి ఎంతో వైభవంగా సీతారాముల కల్యాణం ప్రజలు తిలకించి చూడటానికి వచ్చిన ప్రజలు కనువిందుగా చూసి తరించారు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు దంపతులు మరియు టి ఆర్ ఎస్ నాయకులు పాల్గొని ఈ కల్యాణానికి వచ్చిన ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో మధిర రామాలయం కమిటీ వేములపల్లి విశ్వనాథన్, రామకృష్ణ, వలిశెట్టి శ్రీనివాసరావు, బాణాల శంకరాచారి, జానకి, కొటారి రాఘవరావు, పుతుంబక కృష్ణ ప్రసాద్, మేడిశెట్టి లీలావతి, ఎర్ర నాగేశ్వరరావు, కోట వెంకట కృష్ణ, విజయశాంతి తదితర భక్తులు పాల్గొన్నారు