ఘనంగా నాగ పల్లి లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు

Published: Tuesday March 30, 2021
వెల్గటూర్, మార్చి 28, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కిషన్ రావు పెట శ్రీ నాగ పళ్లి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలలొ భాగంగా ఆదివారం రోజు రథోత్సవం కన్నుల పండుగగా అనంతరం అర్చకులు చక్రస్నానం స్వామివారికి ఏకాంత సేవ పవళింపు సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి పారవశ్యంతో లక్ష్మీ నరసింహ గోవిందా అనే నామం ఈ ప్రాంతమంతా మారుమోగింది స్వామివారికి ప్రత్యేక మొక్కలు తీర్చుకున్నారు. ఉదయం నుండి ప్రొబోదిగా, విశ్వక్సేన వీధి, ఛతు: స్థానార్చన: యశ: సోమకాల హోమం, రథబలి, రథోత్సవం పుష్పయాగం, ఏకాంతసేవ, గ్రామ బలి, కర్తలకు మంగళాశాసనం తీర్థప్రసాద వితరణ ఉబయ వేదాంత సూర్య పంచాంగ కర్త శ్రీ జగన్నాథం విష్ణువర్ధనాఆచార్యులు సింహాచలం మురళీధర్ ఆచార్య, స్థానాచార్యులు తిరునాహరి శ్రీనివాసాచార్య, ఆలయ అర్చకులు జగన్నాథం శ్రీనివాసాచార్య, జగన్నాథం నరసింహస్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం తరఫున ఆలయ పాలకవర్గం  మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పూదరి రమేష్, కార్యదర్శి అల్గునూరి సతీష్, సర్పంచ్ మెరుగు కొమురయ్య, ఉప సర్పంచ్ పూదరి రాజేందర్, ఎం.పీ.టీ.సీ సప్న జ్యోతి రాజు, ధర్మ కర్తలు దాసరపు రామచంద్రరావు, అన్నమనేని గజేంద్ర రావు, గౌరీ లక్ష్మీనారాయణ, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కుమ్మరి వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు నక్క హనుమాడ్లు, పులి ఎల్లయ్య దావన పెళ్లి రమేష్ భోగి సాగర్, బావనపెళ్లి హరీష్, పులి ప్రశాంత్, అలుగునూరి మల్లేష్, శ్రియఃజగన్నాధ వేదపాఠశాల వేదే విద్యార్థులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కర్తలకు ప్రత్యేకంగా ఆశీర్వచనము అర్చకులు నిర్వహించారు.