మత్స్యగిరి ఆలయంలో ఈ నెల 31వ తేదీన స్వాతి కళ్యాణం

Published: Tuesday March 30, 2021

వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహా స్వామి వారి గుట్ట పైన ఈనెల 31వ తేదీన బుధవారం రోజున ఉదయం 8.00.గంటలకు శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ధృవ మూర్తి ప్రధమ వార్షికోత్సవం మరియు స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నర్సింహ స్వామి వారి కళ్యాణం మరియు అన్న దానం పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్లని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారి దర్శనం చేసుకోగలరని ఆలయ ఈఓ కె రవి కుమార్,ఆలయ ధర్మ కర్తల కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డిలు పత్రిక ప్రకటనలో తెలిపారు.