ఘనంగా శ్రీరామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం
Published: Monday March 29, 2021
మేడిపల్లి, మార్చి28 (ప్రజాపాలన ప్రతినిధి): రామంతాపూర్ ఇందిరా నగర్లో నెలకొన్న శ్రీరామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వారి సతీమణి బేతి స్వప్న రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రాావు, మాజీ కార్పొరేటర్ గంధం జోత్స్న నాగేశ్వరరావు హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగ్యలక్ష్మి, చైర్మన్ నరసింహారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, ఎండి రెహమాన్ భక్త జనులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Share this on your social network: