పంచముఖ హనుమాన్ ఆలయలో తృతీయ వార్షికోత్సవాలు

Published: Thursday March 25, 2021
బాలాపూర్, మార్చి 25, ప్రజా పాలన ప్రతినిధి : దిగ్విజయంగా పంచముఖ హనుమాన్ ఆలయ తృతీయ వార్షికోత్సవం పూజలో కార్పొరేషన్ కార్పొరేటర్ సుర్ణగంటి అర్జున్ దంపతులు, కో ఆప్షన్ సభ్యులు గుర్రం ప్రసన్న వెంకట్ రెడ్డి హాజరయ్యారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శ్రీనిలయా టౌన్షిప్ కాలనిలలో వెలిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో గణపతి, శివుడు, ఆంజనేయ స్వామికి అభిషేకం, పూజ, హోంమం భక్తితో స్తుతించారు. అనంతరం మణికంఠ భక్త మండలి నాదర్ గుల్ వారి చేత భజనలు, సాయంత్రం స్వామివారి ఊరేగింపు కోలాటం, భజనలు, నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుర్ణగంటి అర్జున్ దంపతులు, కో ఆప్షన్ సభ్యురాలు గుర్రం ప్రసన్న వెంకట్ రెడ్డి, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు భక్తులు పెద్ద ఎత్తున భక్తులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.