మూవీ : సీటీఆర్ఎల్
నటీనటులు: అనన్య పాండే, విహాన్ సమత్, దేవిక, కామాక్షి, సుచిత్ర త్రివేదీ నిర్వహించారు
ఎడిటింగ్: జహాన్ నోబెల్
సినిమాటోగ్రఫీ: ప్రతీక్ షా
సంగీతం: స్నేహా ఖాన్వాల్కర్
నిర్మాతలు: నిఖిల్ ద్వివేది, ఆర్య మీనన్
దర్శకత్వం: విక్రమాదిత్య మోత్వానే
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
కథ:
నెల్లా (అనన్య పాండే), జో (విహాన్ సమత్) ఇద్దరు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తారు. ఆ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా వారిద్దరు హ్యాపీగా గడుపుతుండగా.. ఒకరోజు వారి లైఫ్ లో అనుకోని సంఘటన జరుగుతుంది. వేరే యువతితో 'జో' చనువుగా ఉండటం వల్ల నెల్ల కంటపడుతుంది. దాంతో ఆమె అతనిపై కోప్పడుతుంది. అప్పటి నుంచి నెల్ల అతనికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలోనే తను లోన్లీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ ఒంటరితనంలోనే ఆమె 'మంత్ర AI' గురించి తెలుసుకుంటుంది. AI లో తనకి నచ్చిన ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకుని, స్క్రీన్ పై కనిపించే ఆ రూపంతో తనకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. ఓ రోజున నెల్ల ఇంటికి 'జో' వస్తాడు. ఆమెతో అర్జెంటుగా ఓ సూచన మాట్లాడటానికి వచ్చానని చెబుతాడు. కానీ నెల్ల అతను చెప్పేది వినిపించుకోకుండా అతడిని గెంటించేస్తుంది. అయితే అదే రోజు నుండి జో కనపడడు. ఎంత వెతికినా అతని ఆచూకి కుడా తెలియదు. అసలు నెల్లాకి జో చెప్పాలనుకున్నదేంటి? ఓ యాప్ నెల్లా జీవితాన్ని ఎలా మార్చేసిందనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
దీనిని సినిమా అంటే సోషల్ మీడియా ఎవేర్ నెస్ డాక్యుమెంటరీ అనేయొచ్చు. ఎందుకంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెగ్యులర్ గా సాగే కామెడీ, డ్రామా కాదు. సినిమా మొదటి అరగంట.. చివరి అరగంట ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇక మధ్యలో స్లోగా సాగుతుంది.
ఈ సినిమా చూసాక యూత్ కాస్త కంట్రోల్ లో ఉంటారు. ఎందుకంటే ఇందులో బయట సమాజంలో యూత్ భిన్నమైన యాప్స్ కి ఎంతలా అడిక్ట్ అవుతున్నారో అర్థమవుతుంది. రెండు ప్రధానమైన పాత్రలను తీసుకుని, వాటి చుట్టూ ఈ కథను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. AI టెక్నాలజీకి సంబంధించిన విషయాలు స్క్రీన్ పై ఆవిష్కరించిన తీరు బాగుంది. ఏదైనా అర్థమయ్యేలా చెప్పడానికే దర్శకుడు ప్రయత్నించాడు. అయితే క్లైమాక్స్ కొంతమందికి అసంతృప్తి కలిగించే అవకాశం కనిపిస్తుంది.
యూత్ ని కనెక్ట్ చేసే పాయింట్ ని దర్శకుడు తీసుకున్నప్పటికీ దానికి ఇంత నిడివి అవసరం లేదు. ఒక రొమాంటిక్ సీన్, మధ్యలో ఓ కిస్ సీన్ ఉంటుంది. అవి రెండు తప్ప మిగిలినదంతా ఓకే. అయితే స్లో సీన్లు సినిమాకి పెద్ద మైనస్. ప్రతీక్ షా ఫోటోగ్రఫీ బాగుంది. స్నేహా ఖన్వాల్కర్ మ్యూజిక్ ఒకే. జహాన్ ఎడిటింగ్ పర్వాలేదు. ఎంటర్టైన్ పెద్దగా లేకపోవడంతో కొంతమందికి నచ్చలేదు.
నటీనటుల పనితీరు:
నెల్ల పాత్రలో అనన్య పాండే సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. జో పాత్రలో విహాన్ సమత్ ఆకట్టుకున్నాడు. ఇక మిగిలినవారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా: యూత్ ని కనెక్ట్ చేసే సీటీఆర్ఎల్(CTRL)..వన్ టైం వాచెబుల్ ఫర్ ఇన్ఫర్మేటివ్ మెసేజ్.
రేటింగ్: 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్