- దోపిడీ దొంగలు పార్థా గ్యాంగ్ సభ్యులు
- జాతీయ రహదారిపై దారికాచి దోపిడీలు
- నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర ప్రత్యేక నిఘా
ముద్రవార్తలు, హైదరాబాద్: హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై దోపిడీ దొంగల ముఠా పార్థా గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు ఫైరింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నల్గొండ ప్రాంతంలో గతంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దోపిడీ దొంగలను పట్టుకోవడానికి నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా నిఘా వేసి, వేట మొదలు పెట్టారు. గురువారం రాత్రి నల్గొండ ప్రాంతంలో దొంగతనం చేసిన పార్థాగ్యాంగ్ సభ్యులు తిరిగి హైదరాబాద్ వైపు వాహనంలో వెళ్లిపోతుండగా, వారిని పోలీసులు వెంబడించారు. పెద్ద అంబర్ పేట సమీపంలోని వారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా వారిపై కత్తులు, ఇతర మరణాయుధాలతో దోపిడీ దొంగలు దాడికి పాల్పడ్డారు, పోలీసులు వారిని భయపెట్టేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది.
నగరంలో పోలీసు కాల్పుల మోతతో ఒక్కసారిగా కలకలం రేగింది. మొత్తం మీద ఈ గ్యాంగ్‌లో మొత్తం నలుగురు పోలీసులు దొంగలను పట్టుకున్నారు. ముఖ్యంగా ఈ పార్థా గ్యాంగ్ జాతీయపై ప్రయాణిస్తున్న వారి వాహనాలను అడ్డగించి దోపిడీలకు వినియోగించుకుంటారు. అలాగే గత కొంత కాలంగా నల్గొండ తదితర ప్రాంతాల్లో దోపిడీ దొంగతనాలకు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు హైవేపై నిలిచిపోవడంతో, నలుగురు దొంగలు అందులో ప్రయాణికులను బెదిరించి వారి మెడల్లో బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అలాగే ఇటీవలే నకిరేకల్ పట్టణంలో ఒక ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. గత ఏడాదిగా నల్గొండ జిల్లా పరిధిలో కూడా పలు దొంగతనాలకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నల్గొండ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శరత్ చంద్ర దీన్ని సవాల్ గా తీసుకున్నారు. అప్పటి నుంచి దోపిడీ దొంగల కోసం వేట ముమ్మరం చేశారు. గత ఇరవై రోజులుగా నల్గొండ క్రైమ్ బ్రాంచి పోలీసులు వేట ఫలించి పార్థా గ్యాంగ్ కు సంబంధించిన నలుగురు దొంగలను పట్టుకోగలిగారు. ఈ గ్యాంగ్ సభ్యులు దొంగతనాలకు వెనుకబడే సమయంలో హత్యలకు కూడా అడారని చెబుతున్నారు.