4
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు ఇచ్చింది. దీంతో ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రాధా కిషన్ రావు మామయ్య వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా నాలుగు రోజులు పాటు మధ్యంతర బెయిల్ ను కోర్టు ఇచ్చింది. ఈ నెల 28 (శనివారం) నాడు ఆయన తిరిగి జైలుకు రావాలని ఆదేశించారు. ప్రయాణ ఖర్చులు, ఎస్కార్టు ఖర్చులన్నీ రాధా కిషన్ రావే భరించాలని స్పష్టం చేసింది