సంధ్యా థియేటర్ కి సంబంధించి రేవతి చనిపోయిన ఘటనలో బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్(allu arjun)ని హైకోర్టు సూచనతో హైదరాబాద్ లోని చిక్కడ పల్లి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 35 (3 ) కింద ఈ రోజు విచారించడం జరిగింది. విచారణలో అల్లు అర్జున్ నుంచి పోలీసులు పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టగా,మరికొన్ని ప్రశ్నలకి జవాబు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.ఇక మూడు గంటల విచారణలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోవడం జరిగింది.ఈ కేసులో మొత్తం పద్దెనిమిది మందిని పోలీసులు నిందితులుగా చేర్చగా అల్లు అర్జున్ గా A 11 మంది ఉన్నారు.
ఇక ఈ కేసు విషయంపై ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడటం అల్లుఅర్జున్ కి బెయిల్ కొన్ని రోజులకే వచ్చింది.అది కూడా ఇంకో రెండు రోజులకి రద్దు అవుతుంది. దీంతో అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్లడం ఖాయమని శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు.