ఆహా వేదికగా ప్రసారమయ్యే బాలకృష్ణ(balakrishna)అన్ స్టాపబుల్ షో కి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే.బాలయ్య అభిమానులు,ప్రేక్షకుల ఆదరణతో ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 జరుగుతుంది.ఎవరు ఊహించని విధంగా సినీ సెలబ్రటీస్ గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు.ఇప్పుడు కూడా ఎవరు ఊహించని విధంగా విక్ వెంకటేష్(వెంకటేష్) )గెస్ట్ గా రావడం జరిగింది. ఈ నెల 27న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాగా రీసెంట్ గా దానికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.
ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన ప్రోమోలో బాలయ్య సినిమా డైలాగ్ ని వెంకటేష్ చెప్పడం,వెంకటేష్ సినిమా డైలాగ్ ని బాలయ్య చెప్పడం,ఆ తర్వాత నాగ చైతన్య(naga chaitanya)ఫోటో రాగానే చాలా మంది పిల్లలని హగ్ చేసుకుంటాం. కానీ చైతన్య ని హగ్ చేసుకుంటే ఆనందం అని.వెంకటేష్ సోదరుడు ప్రముఖ నిర్మాత సురేష్ ఈ షోలో పాల్గొన్నాడు.రామానాయుడు గురించి ప్రస్తావనకి రాగానే వెంకటేష్,సురేష్ ఎమోషనల్ కివ్వాల కోసం సిద్దం చేసారు.రామానాయుడు గురించి వెంకటేష్ మాట్లాడాల్సి ఉంది చేశారనే ఫీలింగ్ నాన్నలో ఉందని సురేష్ చెప్పడం లాంటివి పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ షో లో ఉండబోతున్నాయి.వెంకటేష్ కి ఇంతవరకు ఎవరికి తెలియని సీక్రెట్ ని కూడా సురేష్ చెప్పనున్నాడు.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి(anil ravipudi)కూడా ఈ షో లో పాల్గొని బాలయ్య,వెంకటేష్ తో కలిసి డాన్స్ చేయడం చూస్తుంటే షో మొత్తం ఎంతో హుషారుగా సాగబోతుందని తెలుస్తుంది.ఇక ఇప్పటికే రికార్డు టిఆర్ పికి చాలా ఎపిసోడ్స్ ని వెంకీ ఎపిసోడ్ బీట్ చేసే అవకాశం కూడా ఉందని అభిమానులు అంటున్నారు.ఇక బాలకృష్ణ ,వెంకటేష్ సంక్రాంతికి డాకు మహారాజ్,సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య తెరకెక్కిన ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.