Home తాజా వార్తలు మూడు ముక్కలాట..! బీసీ కమిషనరేట్‌లో తారాస్ధాయికి వర్గపోరు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

మూడు ముక్కలాట..! బీసీ కమిషనరేట్‌లో తారాస్ధాయికి వర్గపోరు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
మూడు ముక్కలాట..! బీసీ కమిషనరేట్‌లో తారాస్ధాయికి వర్గపోరు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • రెండుగా చీలినఉద్యోగులు
  • పరిపాలన నిర్వహణ గాలికి
  • పక్కదారి పట్టిన బీసీల సంక్షేమం
  • పడకేస్తున్న పథకాలు
  • ప్రక్షాళనపై సర్కార్ తర్జనభర్జన

ముద్ర, తెలంగాణ బ్యూరో : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదనట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అద్భుత చర్యలు చేపడుతున్నా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్ కళాశాలలో మాత్రం నిర్లక్ష్య వైఖరి వీడటం లేదు. ఏళ్లుగా ఒకే స్థానంలో పాతుకుపోయి, ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు చేర్చడంలో వైఫల్యం చెందడం విమర్శలకు తావిస్తోంది. పూర్తిగా మొద్దు నిద్రను సర్కారు సైతం సహించలేని స్థితికి చేరుకుంది. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎన్నికల్లో అభ్యున్నతికి వేగంగా కదులుతుంది. ఆ కోవలోనే కుల గణనకు చట్టం చేసి, వేగంగా గణన పూర్తి చేసింది. బీసీ ను కమీషన్ ఏర్పాటు చేసింది. కొత్తగా జాబితాలను ప్రకటించింది. ఇందులో కొన్నింటికి చైర్మన్లను నియమించింది. మెస్, కాస్మోటిక్ చార్జీలను చరిత్రలో లేని విధంగా 40 శాతం పెంచింది. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అడుగు దూరంలో ఉంది. బీసీ కమిషన్ ద్వారా బీసీల స్వయం ఉపాధికి నిర్మాణాత్మక సూచనలు స్వీకరించి, తొందరలో తోడ్పాటు అందించే ప్రక్రియ దిశగా కదులుతుంది.

కలిపి మొద్దునిద్ర..!

వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తుంటే, మరోవైపు బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్‌తో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శాఖ లక్ష్యాలకు అడ్డంకిగా మారింది. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయడంలో అధికారుల వైఫల్యం, శాపంలా మారుతోంది. వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం కళ్ళకు కట్టడంలో చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణి చేటు చేస్తుంది. ఫలితంగా బీసీలకు నష్టం. సంక్షేమ ఫలాలు క్షేత్ర స్థాయిలో అందడం లేదు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయినా నాణ్యతలేని ఆహార వస్తు సామగ్రి సరఫరాదారులపై చర్యలు తీసుకోవడంలో మొద్దు నిద్ర, కుమ్మక్కు కోణాన్ని చెప్పకనే చెబుతుంది. ఏళ్లుగా పాతుకుపోయిన అపవిత్ర బంధాలే వీనింటికీ కారణం. దీంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

అధికారుల చీలికతో గ్రూపుల లొల్లి..!

రాష్ట్ర శాఖ అంటే ఇతర జిల్లా శాఖలకు ఆదర్శంగా ఉండాలి. కానీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం మాత్రం వర్గ పోరుతో సతమతం అవుతోంది. మూడు విభాగాలుగా విడిపోయి, పరిపాలనను ముక్కలాటగా మార్చారు. ఫలితంగా డీడీలు, జైంట్‌లు, డీబీసీడీవోలు, ఏబీసీడీవోలు, ఈవోలు, వార్డెన్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు అధిపత్య ధోరణులు ప్రదర్శించూ, పరిపాలన గాలికి వదిలేస్తున్నారు. పరిస్థితి ఎంత వరకు వెళ్లిందంటే, ఒక ఉన్నతాధికారితో ఎవరైనా కింది స్థాయి ఉద్యోగి మాట్లాడితే, సదరు ఉద్యోగుల ఫైళ్లు పెండింగ్ లోనే ఉంటున్నాయి.

చెప్పులు అరిగేలా తిరిగినా పనులు అవని దుస్థితి. తమ వర్గం ఉద్యోగులు కారని పనులు చేయని దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. అయినా మొన్నటి వరకు శాఖలో కొనసాగుతున్న ఓ ముఖ్య ఉన్నతాధికారి ఆశీస్సులతో పదేళ్లుగా రాజ్యమేలుతున్న అధికారి, కోరుకున్న కుర్చీ దక్కలేదని సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్న మరో అధికారి, తాజాగా ఆరోపణలపై సైలెంట్ అయిన అధికారుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. శాఖలో అధికార ఆధిపత్యం కోసమే కొట్లాడుతున్నారు తప్పితే, డిపార్ట్‌మెంట్ బాగుకు పని చేయడం లేదు. ఏళ్లుగా కమిషనరేట్ అయిన వీరు పాతుకుపోవడంమే ఈ సమస్యలన్నింటికి మూల కారణం. వీరిని కదిలిస్తే తప్పా, పరిస్థితిలో మార్పు ఆశించడం అత్యాశే అనుకోవచ్చు.

అయిన వాళ్ళకు అందలం..!

బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్ ప్రారంభానికి వర్గ పోరు కొందరికి మోదం మరికొందరికి ఖేదం అన్నట్టు మారింది. తమ వర్గంలోని వారికి సెక్షన్లు కట్టబెట్టడంలో నిబంధనలు పాటించడం లేదు. ఇష్టారీతిగా నిర్వహణ విభాగం కేటాయింపు జరుగుతోంది. సీనియారిటీ, పని తీరు కొలమానంగా లేదు. ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేకుల ఫైళ్ళను మాయం చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.

విభేదాలకు కారణాలివే..!

పదేళ్లుగా కమిషనరేట్ తిష్ట వేసిన ఓ డీబీసీడీఓ అధికారి చేతిలో కీలకమైన విభాగాలను పెట్టారు. ఇక్కడే పదేళ్లుగా పాగా వేసిన ఓ ఉన్నతాధికారితో అల్లుకున్న అక్రమ ఆర్థిక బంధమే దీనికి కారణం. సదరు అధికారి బదిలీ అయినా, ఇక్కడ మళ్లీ కొనసాగడంలో ఆంతర్యం కూడా అదేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీ ఫెడరేషన్ల నిద్రావస్థకు, ఓ ముఖ్య అధికారి వైఖరే కారణమని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు తాత్సారానికి కమిషనరేట్ నిర్లక్ష్యమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. తనువోచోట మనసోచోట అన్నట్టు అయిన వాళ్ళు ఆశీస్సులతో ప్రమోషన్ ఒక దగ్గర పొంది, మరోచోట కుర్చీ వెలగబెట్టడం బీసీ కమిషనరేట్ కార్యాలయానికే సాధ్యమని చాలా మంది నవ్వుకుంటున్నారు.

మాతృ శాఖ ఉద్యోగుల నుంచి ప్రతి పనికి డబ్బులు గుంజడం కమిషనరేట్ పరిధిలోని ఓ ఉన్నతాధికారికే చెల్లిందని శాఖలోని ఉద్యోగుల చెవులు కొరుక్కుంటున్నారు. సదరు అధికారిపై గతంలో ఏసీబీ కేసు నమోదు కావడం విశేషం. అయినా ఈ అధికారి తీరు మారకపోగా, నిత్యం డబ్బుల వేట సాగిస్తూ, తోటి ఉద్యోగులను వేధించడం.హాస్టళ్ల తనిఖీల పేరిట వార్డుల నుంచి అక్రమ వసూళ్లు చేయడం, దొంగ బిల్లులతో డబ్బులు ఇవ్వడం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రక్షాళన చేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech