- ప్రభుత్వం ఈ ఘటనకు అనుకూలంగా మల్చుకుంటుంది
- రాజకీయాలకు, సినిమాలకు ఏం సంబంధం?
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన అంతా పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కిషన్ రెడ్డి మాట్లాడారు.. సంధ్యా థియేటర్ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ఘటన జరగకుండా చూసుకోవడంలో పోలీసులు పకడ్బందీగా ఎందుకు వ్యవహరించలేదని ఆయన ప్రశ్నించారు.
రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమని, ఇది రేవంత్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే చూడాల్సివస్తుందని అన్నారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణలో మార్పు ఏమీ కనిపించలేదని ఆయన కనిపించారు. ఈ రెండు పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేశాయని ఆయన దుయ్యబట్టారు. అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ , ప్రజల మనోభిష్టం మేరకు బీజేపీ పనిచేస్తోంది. కాంగ్రెస్ ను ఓడించడమే బీజేపీ లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.