హీరోగా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,ప్రముఖనటుడు సాయికుమార్(సాయి కుమార్)సినీ ప్రస్థానం గురించి,సినీ ప్రేమికులందరికి తెలిసిన విషయమే.ముఖ్యంగా 1996లో ఆయన హీరోగా తెరకెక్కిన 'పోలీస్ స్టోరీ'(పోలీస్ స్టోరీ)సినిమా అయితే తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఒక ప్రభంజనం. ఘన విజయాన్ని సాధించడంతో పాటు రికార్డు స్థాయి వసూళ్ళని అందుకుంది. కన్నడనాట అయితే ఇక చెప్పక్కర్లేదు.'పోలీస్ స్టోరీ' తో సాయికుమార్ నైట్ ఓవర్ సూపర్ స్టార్ అయ్యాడు.
రీసెంట్ గా సాయికుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు అమ్మ చనిపోయాక ఆమె రాసిన డైరీ చదివాను.దాంతో అమ్మ పుట్టిన ఊరైన 'భాగేపల్లి' కి ఏదైనా చెప్పాలని అనుకున్నాను దాంతో 2008 ఎలక్షన్స్ లో భాగేపల్లి నుంచి నాకిషమైన బిజెపీ పార్టీ నుంచి ఎంఎల్ ఏగా పోటీ చేసి ఓడిపోయాను. ఆ నియోజక వర్గంలో గత యాభై ఏళ్ళ నుంచి బిజెపీ కి 2000 ఓట్లు కూడా రాలేదు.అలాంటిది నాకు 27000 ఓట్లు వచ్చాయి.నాతో పాటు కార్యకర్తలందరూ పోటీ చేయడంతో ఆ ఓట్లు వచ్చాయి.కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాక కుటుంబ బాధ్యతల మీద దృష్టి పెట్టి నియోజక వర్గానికి దూరమయ్యాను. దాంతో నన్ను ఆ విధంగా చేసిన కార్యకర్తలని వదిలేయాల్సి వచ్చింది.నేను ఆ సంగతి చెప్పటంతో చాలా మంది కార్యకర్తలు అవతలి వైపు వాళ్ల నుంచి టార్చర్ కి నమ్మారు.సాయికుమార్ కి పని చేశారు కదా ఇప్పుడు మీ చూస్తామనేంతలా ఆంటర్ అయ్యారు.చాలా మందిని అట్రాసిటీ కేసులో కూడా ఇరికించారు.అవన్నీ నాకు చాలా బాధ కలిగించాయి. చూపించలేకపోయాను.ఓడిపోయినా అక్కడే ఉండి ఉంటే 2013 లో ఖచ్చితంగా గెలిచేవాడిని.ఆ విషయం నాకు తెలుసు చెప్పుకొచ్చాడు,సాయికుమార్ ఇటీవల సరిపోదా శనివారం, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో తన సత్తా చాటాడు.