- న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాం
- ప్రజలు, పోలీసుల జోలికొస్తే తాట తీస్తా బౌన్సర్లకు హెచ్చరిక
- ఘటనకు సంబంధించి మినిట్ టూ మినిట్ విడియో రిలీజ్ చేసిన సీపీ సీవీ ఆనంద్
ముద్ర, తెలంగాణ బ్యూరో : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొన సాగుతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నాడు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మీడియా సమక్షంలో సంధ్యా ధియేటర్ ఘటనకు సంబంధించి మినిట్ టూ మినిట్ వీడియోను సీఐ ఆనంద్ విడుదల చేసి, మాట్లాడారు.. ఘటన సమయంలో అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఎస్ హెచ్ వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. అల్లు అర్జున్ కోసం థియేటర్ వాళ్ళు దరఖాస్తు చేస్తే తిరస్కరించామని సీవీ ఆనంద్ అన్నారు. థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ కు విషయం చెప్పారో లేదో తెలియదన్నారు.
ఇదిలావుండగాన్సర్ల సప్లయ్ ఏజెన్సీలకు కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. బౌన్సనర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా, ప్రజల పట్ల అనుచితంగా ప్రవర్తించినా సరే బౌన్సర్ల తాటి తీస్తామని ఆయన ప్రకటించారు. బౌన్సర్ల ప్రవర్తనకు సప్లయ్ ఏజెన్సీలదే పూర్తి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. బౌన్సర్ల తీరుకు వారిని పెట్టుకున్న వీఐపీలు, సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఏజెన్సీలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అనంతరం ఏసీపీ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి జరిగిన మీడియాకు వివరించారు.
తొక్కిసలాట జరిగిన అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌ను కలిసి తొక్కిసలాటలో మహిళ చనిపోయారని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారని, పరిస్థితి అదుపు తప్పిందని, థియేటర్ నుంచి వెళ్లిపోవాలని సూచించామని, అందుకు మేనేజర్ తమను అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయలేదని చెప్పారు. అయినా అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి ఈ విషయం అల్లు అర్జున్‌కు చెప్పామని చెప్పారు. అయితే సినిమా తర్వాతే వెళ్తానని అల్లు అర్జున్ చూసి చెప్పారనన్నారు. దీనితో డీసీపీ జోక్యం చేసుకుని 15 నిమిషాలు సమయం ఇచ్చి , అల్లు అర్జున్ వెళ్లడానికి అధికారులంతా సహకరించి రూట్ క్లియర్ చేశారు. అయితే తాము లోపలికి వెళ్ళిన వీడియో ఫుటేజీలు ఉన్నాయని, అల్లు అర్జున్ తో మాట్లాడిన ఫుటేజ్ ల కోసం ప్రయత్నిస్తున్నామని వైసీపీ రమేష్ కుమార్ పేర్కొన్నారు.