Home తాజా వార్తలు భూ భారతికి తుది మెరుగులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

భూ భారతికి తుది మెరుగులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
భూ భారతికి తుది మెరుగులు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • అసెంబ్లీలో ఆమోదిత చట్టంలో పలు అంశాలను చేర్చు
  • ప్రతిపక్ష సభ్యుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సర్కార్
  • ఆర్వోఆర్‌లో కొత్త సెక్షన్లు చేర్చేందుకు ఉచ్ఛికం
  • త్వరలోనే గవర్నర్ పేషీకి కొత్త చట్టం
  • ఆమోదం లభిస్తే అమల్లోకి భూ భారతి

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో ఆమోద ముద్ర పడ్డ భూభారతీ చట్టానికి ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. దీనికి సంబంధించిన నూతన చట్టం ఆర్వోఆర్‌లో పలు అంశాలను చేర్చాలంటూ అధికార, విపక్ష ఎమ్మెల్యేలు శాసనసభలో విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సర్కార్ అందులో కొత్త సెక్షన్లు చేర్చేందుకు ఐచ్ఛికాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. చట్టం ఆమోదం కోసం ఆ ఫైల్‌ను గవర్నర్ వద్దకు పంపేందుకు సిద్ధమైంది. మార్పులన్నీ సజావుగా జరిగితే ఆ బిల్లు త్వరలోనే గవర్నర్ ఆమోదానికి వెళ్లనుంది. ఆయన ఆమోదముద్ర చట్టం అమల్లోకి వస్తుందని వారందరూ తెలిపారు. ఈ సాగు భూములు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో భూభారతి ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది.

భూ పరిపాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ధరణిను సమూలంగా మార్చేసి నూతనంగా భూ భారతిని అమల్లోకి తీసుకు వచ్చింది. రైతులు, భూ యజమానుల హక్కుల రక్షణ, భద్రతతో పాటు అనేక రకాల సహాయ సహకారాలు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి బిల్లును తయారు చేసింది. ధరణి స్థానంలో 19 సెక్షన్లతో తెలంగాణ భూ భారతి ఆర్వోఆర్-2024 సమగ్ర చట్టాన్ని రూపొందించింది. ప్రతి గుంట భూమికీ చట్టబద్ధమైన హక్కు కల్పిస్తూనే ఆ హక్కుల బాధ్యతను కూడా ఈ చట్టం పర్యవేక్షించేలా పటిష్టమైన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. గతంలో మాదిరి భూ వివాదాలకు కోర్టుల చుట్టూ తిరగకుండా జిల్లా స్థాయిలోనే రెండు అప్పీళ్ల వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

ఏళ్ల తరబడి నివాస స్థలాలపై హక్కులులేని గ్రామ కంఠం భూములకు పట్టా పాసు పుస్తకాల జారీకి భూభారతి చట్టంలో అవకాశం కల్పించింది. రైతులు, భూ యజమానుల సమస్యలకు పరిష్కారాలను కూడా చట్టబద్ధం చేసేలా పలు సెక్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ధరణిలో మాదిరిగానే ఏక కాలంలో భూములు- మ్యుటేషన్ విధానంలో ఎలాంటి మార్పు చేయలేదు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన మూడు నెలల్లో పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను రూపొందించనున్నారు అధికారులు. ఆ తరువాత చట్టంలోని సెక్షన్లు, నిబంధనలు అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని రాష్ట్రాల ఆర్వోఆర్‌లను అధ్యయనం చేసి తెలంగాణ ఆర్వోఆర్-2024 బిల్లును పొందింది.

ఎమ్మార్వో-ఆర్డీవో-కలెక్టర్‌ స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థ ఇకపై భూముల వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎమ్మార్వో స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు, అక్కడి నుంచి కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ చట్టంలో..న్యాయపరమైన భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయనున్నారు. డివిజన్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునల్‌తో పాటు భూ పరిపాలన ట్రైబ్యునల్‌ కమీషన్‌ను నియమించింది. ఏదైనా భూ వివాదంపై తహసీల్దార్‌కు దరఖాస్తు చేసి అక్కడ కాకపోతే 60 రోజుల్లో ఆర్డీవోకు అప్పీల్ చేసుకునే వెసులుబాటు భూభారతిలో కల్పించింది. ఆర్డీవో స్థాయిలో కూడా సమస్యకు పరిష్కారం రాకపోతే 60 రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ అప్పీళ్లలో జిల్లా కలెక్టర్‌దే అంతిమ నిర్ణయం కానున్నది. కొన్ని భూముల వివాదాల్లో నేరుగా ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ అధికారి చూపే పరిష్కారంతో విభేదిస్తే 30 రోజుల లోపు కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. కొన్ని అంశాల్లో నేరుగా కలెక్టర్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అక్కడ కలెక్టర్ ఇచ్చే ఉత్తర్వులతో విభేదిస్తే 30 రోజుల్లో భూ పరిపాలనా ట్రైబ్యునల్‌లో సవాల్‌ చేసుకునే వెసులుబాటు ఉండేలా చట్టాన్ని రూపొందించారు.

సాదాబైనామా పై ప్రత్యేక సెక్షన్..!

సాదాబైనామా కొనుగోళ్లను క్రమబద్ధీకరించేలా భూభారతి చట్టంలో ప్రత్యేక సెక్షన్ ను పొందుపరిచారు. తెల్లకాగితాలపై ఒప్పందాల 2014, జూన్ 2కు ముందు జరిగిన కొనుగోళ్లను క్రమబద్ధీకరించాలని ఆర్వోఆర్-2024 చట్టం సెక్షన్ 6(1) ద్వారా నిర్ణయించారు. ఆర్వోఆర్ 1971 చట్టం ప్రకారం 2020, సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 10 వరకు 9.24 లక్షల దరఖాస్తులు స్వీకరించగా క్రమబద్ధీకరణ పెండింగ్‌లో ఉంది. ఆర్డీవో స్థాయిలో విచారణ నిర్వహించి క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టారు. ఇక వీలునామా లేని ఆస్తుల విషయంలో యాజమాన్య హక్కుల బదిలీ సందర్భంగా ఏక కాల ఒప్పందం- మ్యుటేషన్‌ ప్రక్రియ రద్దు చేయబడింది.

ఇకపై మ్యుటేషన్ సందర్భంగా వారసులు ఒక సంయుక్త వివరణను సమర్పించేలా చట్టంలో నిబంధన తీసుకొచ్చారు. సంబంధిత కుటుంబ సభ్యులందరికీ తహసీల్దార్ నోటీసు జారీ చేసి విచారణ చేపడతారు. ఆ తరువాతే మ్యుటేషన్‌ పూర్తి చేసి, సెక్షన్‌ 7(4)ను అనుసరించి కుటుంబ సభ్యులందరికీ వివరాలు అందజేస్తారు. భూభారకి చట్టంలోని 4(1) సెక్షన్‌ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న అన్ని రకాల భూముల హక్కుల రికార్డులను రూపొందించారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి భూ భాగాలను ప్రత్యేకంగా మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. భూ యజమాని, పట్టాదారు, తనఖాదారుల పేర్లు, వారి వివరాలను నమోదు చేసి ఆ ఆస్తుల యాజమాన్యాన్ని గుర్తిస్తున్నారు.

ఆబాదీ, గ్రామ కంఠం ప్రాంతాల నివాస స్థలాలకు పూర్తి హక్కులు..!

గ్రామాల్లో ఆబాదీ లేక గ్రామ కంఠం ప్రాంతాల నివాస స్థలాలకు కొత్త చట్టం ద్వారా సంపూర్ణ హక్కులు లభిస్తాయి. నివాస స్థలాలకు సైతం పట్టా పాసుపుస్తకం లేదా ధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆన్‌లైన్‌లోనూ ఈ భూముల నిర్వహణ కొనసాగుతుంది. ఆబాదీ స్థలాల హక్కుల కల్పనకు ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అనంతరం హక్కుల రికార్డుల రూపకల్పనను ప్రారంభిస్తుంది. భూముల క్రయ విక్రయాల సందర్భంగా తహసీల్దార్‌- సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌కు సమర్పించే భూ దస్త్రాలతోపాటే భూమి సర్వే, సబ్‌ డివిజన్‌ ​​సర్వే మ్యాప్‌ను తప్పనిసరిగా జోడించాల్సి ఉంటుంది. దీనివల్ల డబుల్ చెల్లింపులు, ప్రభుత్వ భూములు వివాదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఈ మేరకు సర్వే మ్యాప్‌ను రికార్డుల్లో భద్రపరచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక అన్ని ప్రభుత్వ రకాల భూముల రక్షణకు కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లు ఏర్పాటు చేశారు. సర్కార్ భూముల విషయంలో ఇకపై సుమోటో విచారణతో ఆక్రమాలను కట్టడి చేయనున్నారు. ఆ శాఖకు చెందిన రికార్డుల్లో మార్పులు, చేర్పులు, దిద్దుబాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌- సీసీఎల్‌ఏ తనంతతానుగా లేదా ఎవరైనా దరఖాస్తు చేసినా విచారణ చేపట్టే అధికారం ఉంటుంది. మోసపూరితంగా హక్కులు జారీ చేస్తే ఆ పట్టాదార్‌ పాసుపుస్తకం రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది. సంబంధిత తహసీల్దార్‌ను విధుల నుంచి తొలగించడం, ఆ భూమిని వెనక్కు తీసుకుని క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కలెక్టర్‌కు అధికారాలను కట్టబెట్టారు.

నిరక్షరాస్యులు, పేదలకు ఉచిత న్యాయ సలహాలు

భూ సమస్యలపై న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పేద న్యాయ సలహాలు అందజేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఆర్వోఆర్-2020 చట్టాన్ని ఎటువంటి మార్పులకు అవకాశం లేకుండా, ఏ స్థాయిలోనూ ఎవరికీ అధికారాలు లేకుండా తయారు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఆర్వోఆర్-2024 చట్టంలో అవసరాలకు వీలుగా ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వం అమలు చేసే సెక్షన్లు, క్లాజులు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. కాకుండా 2017-18లో నాటి ప్రభుత్వం చేపట్టిన నవీకరణ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా చిన్న చిన్న సమస్యలతో పాటు పక్కన పెట్టిన 18 లక్షల ఎకరాల భూములకు స్పష్టత రానుంది. ఈ భూములపై ​​సమగ్ర విచారణ జరిపి హక్కుల జారీకి అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

ఆధార్ తరహాలో భూధార్

కేంద్ర ప్రభుత్వం దేశ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను తీసుకు రావాలని భావిస్తోంది. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రతి కమతానికి భూ భౌతిక సరిహద్దులు నిర్ణయించి శాశ్వత రక్షణ కల్పించాలనేది దీని ప్రధాన ఉద్దేశం. దీని కోసమే భూధార్’ తెచ్చింది. ఈ విధంగానే రాష్ట్రంలో ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక సంఖ్య, కార్డును జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, రాష్ట్రంలో భూములు పూర్తి స్థాయిలో జరగకుండా శాశ్వత భూధార్‌ కార్డు జారీ చేస్తే యాజమాన్య హక్కుల్లో సమస్యలు వస్తాయని ప్రభుత్వం రెండు రకాల విధానాలకు భూభారతి కొత్త చట్టంలో స్థానం కల్పించింది. ప్రస్తుత రికార్డులను అనుసరించి తాత్కాలిక, పూర్తి స్థాయి సర్వే అనంతరం శాశ్వత ప్రాతిపదికన భూధార్‌ను జారీ చేయాలని నిర్ణయించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech