ముద్ర, తెలంగాణ బ్యూరో : పుష్పా సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించే ఆసుపత్రికి వచ్చిన ఆయన.. శ్రీతేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసులో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని దగ్గరకు వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి రూ.25 లక్షల చెక్కును శ్రీతేజ తండ్రికి అందించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి సాయం కావాలన్నా పేర్కొన్నారు.
ప్రస్తుతానికి బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా కిమ్స్ లో ప్రత్యేక చికిత్స పొందుతున్న ఈ బాలుడిని కోమటిరెడ్డి శనివారం సాయంత్రం పరామర్శించారు. శ్రీ తేజ ఆరోగ్యం తొందరగా మెరుగవ్వాలని, కోలుకుని తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించానని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి.. 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనకు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి చుస్తే భయమేస్తోందని చెప్పారు. శ్రీతేజ పూర్తిగా కోలుకోవడానికి 1, 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చని, కోలుకున్నా మాటలు వస్తాయో రావో తెలియదని చెప్పారు. శ్రీతేజ భాస్కర్ కు ధైర్యం చెప్పిన కోమటిరెడ్డి.. అతని ఇద్దరు పిల్లల చదువు కోసం కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహాయం అందజేస్తామని తండ్రి చెప్పారు. హీరో అల్లు అర్జున్ పై కేసు దర్యాప్తు జరుగుతుందని, కోర్టులో అంశంపై తాను మాట్లాడానని చెప్పారు. శ్రీతేజ మెరుగైన ఆరోగ్యం కోసం.. అవసరమైతే అమెరికా నుంచి మెడిసిన్ తెప్పిస్తుంది.